శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 11:00:48

గంజాయి మొక్కల ధ్వంసం.. పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ

 గంజాయి మొక్కల ధ్వంసం.. పర్యావరణ పరిరక్షణకు ప్రతిజ్ఞ

కులూ : హిమాచల్‌ ప్రదేశ్‌ కులూలోని నిర్మండ్ ప్రాంతంలో పోలీసులు, వివిధ సంస్థలకు చెందిన కార్యకర్తలు సోమవారం గంజాయి మొక్కలను ధ్వంసం చేసి పర్యావరణాన్ని కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. పచ్చదనం పెంపునకు పలు ప్రాంతాల్లో మొక్కలు నాటి నీళ్లు పోశారు. ‘పోలీసుల సహకారంతో గంజాయి మొక్కలను ధ్వంసం చేశాం. ఇవాళ నాటిన మొక్కలను సంరక్షించేందుకు మేమంతా ప్రతిజ్ఞ చేశాం' అని ఓ సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. స్థానికులు సైతం వీరి చర్యకు మద్దతుగా నిలిచి అభినందించారు. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన పోలీసులకు, సామాజిక సంస్థల కార్యకర్తలకు వారు ధన్యవాదాలు తెలిపారు. గంజాయిని మారిజువానా అనే మరో పేరుతో కూడా పిలుస్తారు. గంజాయి మొక్క నుంచి తయారు చేసిన  ఔషధాలను వైద్యంలోనూ వినియోగిస్తారు. 


logo