మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Sep 24, 2020 , 10:44:07

మాస్క్ పెట్టుకోను.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంమంత్రి క్షమాప‌ణ‌లు

మాస్క్ పెట్టుకోను.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంమంత్రి క్షమాప‌ణ‌లు

హైద‌రాబాద్‌: మ‌ధ్య‌ప్ర‌దేశ్ హోంమంత్రి న‌రోత్త‌మ్ మిశ్రా వెన‌క్కి త‌గ్గారు. మాస్క్‌పై చేసిన కామెంట్‌ను ఆయ‌న స‌వ‌రించారు. మాస్క్‌ను ఎప్పుడూ పెట్టుకోన‌ని ఇటీవ‌ల మంత్రి కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌తిప‌క్షాలు ఆందోళ‌న చేప‌ట్టాయి. మాస్క్ నిబంధ‌న‌లు కేవ‌లం సాధార‌ణ పౌరుల‌కేనా అంటూ కాంగ్రెస్ పార్టీ విమ‌ర్శ‌లు చేసింది.  హోంమంత్రి న‌రోత్త‌మ్‌పై విమ‌ర్శ‌లు ఎక్కువ కావ‌డంతో.. ఆయ‌న త‌న వ్యాఖ్య‌ల‌ను స‌రిచేస్తూ వివ‌ర‌ణ ఇచ్చారు. మాస్క్‌లు ధ‌రించ‌ను అని తాను చేసిన వ్యాఖ్యలు చ‌ట్ట వ్య‌తిరేకంగా ఉన్న‌ట్లు మంత్రి తెలిపారు. ప్ర‌ధాని మోదీ ఇచ్చిన ఆదేశాల‌కు అనుగుణంగా త‌న వ్యాఖ్య‌లు లేవ‌న్నారు.  చేసిన త‌ప్పును అంగీక‌రిస్తున్నాన‌ని, క్ష‌మాప‌ణలు చెబుతున్న‌ట్లు న‌రోత్త‌మ్ తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్ ధ‌రించి, సోష‌ల్ డిస్టాన్స్ పాటించాల‌ని ఆయ‌న కోరారు. 


logo