Indian railways | న్యూఢిల్లీ, జూన్ 28: భారతీయ రైల్వేలోని గ్రూప్- సిలో(లెవల్-1తో కలిపి) 2.74 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నట్టు ఆ శాఖ వెల్లడించింది. జూన్ 2023 వరకు మొత్తం మంజూరైన పోస్టులు 9.82 లక్షలు కాగా, ఒక్క భద్రతా విభాగంలోనే 1.7 లక్షలకు పైగా ఖాళీలున్నట్టు మధ్యప్రదేశ్ ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ అడిగిన ప్రశ్నకు బదులిచ్చింది. ఇవన్నీ నాన్-గెజిటెడ్ పోస్టులని రైల్వే శాఖ పేర్కొంది.