న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్జాతీయ కార్యదర్శి, లోక్సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ విదేశాల్లో భారత ఉగ్రవాద వ్యతిరేక వైఖరిని వివరించే ప్రతినిధుల బృందంలో సభ్యుడయ్యారు. గతంలో కేంద్రం ఈ బృందంలోకి ఎంపిక చేసిన టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ ప్రతినిధుల బృందం నుంచి వైదొలిగారు. మంగళవారం టీఎంసీ ఈ విషయాన్ని వెల్లడించింది.
తమ పార్టీ సూచించిన వారినే అఖిల పక్ష బృందంలోకి తీసుకోవాలని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజుజు సోమవారం మమతతో భేటీ అయ్యారు. అనంతరం కేంద్రం అభిషేక్ బెనర్జీని అఖిల పక్ష బృందంలోకి తీసుకున్నది.