Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరవ్ భరధ్వాజ్ పేర్కొన్నారు. మోదీ సర్కార్‌పై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతోందని అన్నారు. దేశ రాజధానిలో తాము ఎన్నుకున్న సీఎంను కాషాయ పాలకులు జైల్లో పెట్టిన తీరు పట్ల ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు.
బీజేపీ కార్యకర్తలు సైతం కేజ్రీవాల్ అరెస్ట్‌ను జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. ఆప్ తిరిగి 2012 నాటి ఊపును అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రజలు ముందుకొచ్చి పాటలు పాడుతున్నారని, ఆప్ హవాను ఈ వాతావరణం కండ్లకు కడుతోందని పేర్కొన్నారు. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌కు నిరసనగా ఆదివారం జంతర్ మంతర్ వద్ద ఆప్ శ్రేణులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టాయి.
ఇక రాజకీయ బల ప్రదర్శనకు ఇది సమయం కాదని, నియంతలకు వ్యతిరేకంగా గట్టి సందేశం పంపాల్సిన సందర్భమిదని పంజాబ్ సీఎం, ఆప్ నేత భగవంత్ మాన్ అన్నారు. భగత్ సింగ్ స్వేచ్ఛా వాయువులను మనకు అందిస్తే ఇప్పుడు ఆ స్వేచ్ఛ పెను ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read More :
Chicken Price | మాంసంప్రియులకు షాకింగ్ న్యూస్.. వారం రోజుల్లోనే 100 పెరిగిన చికెన్ ధరలు