AAP | ఆప్ నేతలను అకారణంగా అరెస్ట్ చేస్తున్నారు : సందీప్ పాఠక్
AAP : ప్రధాని నరేంద్ర మోదీ ఆప్ నేతలందరినీ ఒకరి తర్వాత ఒకరిని జైలు పాలు చేస్తున్నారని ఆ పార్టీ నేత సందీప్ పాఠక్ ఆరోపించారు.
AAP : ప్రధాని నరేంద్ర మోదీ ఆప్ నేతలందరినీ ఒకరి తర్వాత ఒకరిని జైలు పాలు చేస్తున్నారని ఆ పార్టీ నేత సందీప్ పాఠక్ ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండానే తమ పార్టీ నేతలను నిర్బంధంలోకి తీసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రధాని తీరుతో విలువైన దేశ సమయం వృధా అవుతోందని, అందుకే తాము స్వచ్ఛందంగా అరెస్ట్ అవుతాయని ఆ మేరకు సమయం ఆదా అవుతుందని చెప్పుకొచ్చారు. ఈరోజు కాషాయ పాలకులు తమను అరెస్ట్ చేస్తే రేపు మరింత మంది అరెస్ట్ అయ్యేందుకు ముందుకొస్తారని ఆప్ నేత పేర్కొన్నారు. ఇక రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిభవ్ కుమార్‌ను కాపాడేందుకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ అన్నారు.
కేజ్రీవాల్ కుయుక్తులు చూస్తుంటే ఆయన కనుసన్నల్లోనే ఈ ఘటన జరిగిందని వెల్లడవుతోందని ఆరోపించారు. కేజ్రీవాల్ తన నివాసంలో ఓ మహిళ పట్ల దురుసుగా వ్యవహరించిన వ్యక్తిని కాపాడేందుకు నిరసనలు చేపట్టడం శోచనీయమని అన్నారు. బిభవ్ కుమార్‌కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడటం లేదని మనోజ్ తివారీ ప్రశ్నించారు.
అసలు అతడిని కాపాడేందుకు కేజ్రీవాల్ ఎందుకు ప్రయత్నిస్తున్నారని నిలదీశారు. బిభవ్ కుమార్ మహిళతో అభ్యంతరకరంగా ప్రవర్తించారని, సీసీటీవీ ఫుటేజ్‌ను ధ్వంసం చేశారని ఆప్ నేతలు ఇంతటి కుట్రకు తెగబడ్డారని బీజేపీ ఎంపీ ఆరోపించారు. మరోవైపు ఢిల్లీ పోలీసులు బీజేపీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరబ్ భరద్వాజ్ ఆదివారం ఆరోపించారు.
Read More :
JEE Main | జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల.. టాప్‌లో తెలంగాణ, ఏపీ విద్యార్థులు
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AAP
- Delhi CM
- Pm Modi
- Sandeep Pathak
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

