AAP| జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఎట్టకేలకు ఖాతా తెరిచింది. తొలి విజయం నమోదు చేసింది. దోడా అసెంబ్లీ స్థానంలో ఆప్ అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్ (Mehraj Malik) విజయం సాధించారు. సమీప బీజేపీ అభ్యర్థి గజయ్ సింగ్ రాణాపై 4,538 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఈ గెలుపుతో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద డ్యాన్సులు చేస్తూ సందడి చేశారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
#WATCH | Aam Aadmi Party (AAP) workers celebrate at the party office in Delhi as the party opened its account in the Jammu and Kashmir elections with party candidate Mehraj Malik winning from Doda Assembly seat. pic.twitter.com/MWxDdK37Yr
— ANI (@ANI) October 8, 2024
మరోవైపు జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ – కాంగ్రెస్ కూటమి హవా కొనసాగిస్తోంది. 90 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు గానూ ఎన్సీ కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మొత్తం 48 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. 40 స్థానాలకు ఫలితం తేలింది. మరో ఎనిమిది స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. బీజేపీ కేవలం 29 స్థానాలకే పరిమితమైంది. దీంతో జమ్ము కశ్మీర్లో త్వరలో కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది.
Also Read..
Akkineni Nagarjuna | రాజకీయ దురుద్దేశంతోనే కొండా సురేఖ కామెంట్స్ : నాగార్జున
AP News | ముందు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పండి.. టీడీపీ నేతలను కడిగిపారేసిన వైసీపీ
Vinesh Phogat | జులానాలో వినేష్ ఫొగాట్ విజయం