Aditya Thackeray | ఈవీఎంలు లేకుంటే బీజేపీకి 40 సీట్లు కూడా వచ్చేవి కాదు : ఆదిత్య ఠాక్రే
Aditya Thackeray : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లపై శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుంటే బీజేపీకి కనీసం 40 సీట్లు కూడా వచ్చేవి కాదని అన్నారు.
Aditya Thackeray : లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సాధించిన సీట్లపై శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలు లేకుంటే బీజేపీకి కనీసం 40 సీట్లు కూడా వచ్చేవి కాదని అన్నారు. అమోల్ కృతికార్ స్ధానంలో తాము విజయం సాధించామని, దీనిపై తాము న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. ఈసీ అంటే ఎన్నికల కమిషన్ కాదని, ఈజీలీ కాంప్రమైజ్డ్ అని సరికొత్త భాష్యం చెప్పారు.
కాషాయ పార్టీ ఈవీఎంలను అడ్డుపెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించిందని అన్నారు. ఇక ముంబై ఈవీఎం వివాదం పెను దుమారం రేపుతోంది. ఈ ఉదంతంపై శివసేన నేత సంజయ్ నిరుపమ్ స్పందిస్తూ శివసేన (యూబీటీ) వాయువ్య ముంబై సీటును కేవలం 48 ఓట్లతో కోల్పోయిందని, ఈ విషయాన్ని ఈవీఎంలపై ఆరోపణలు గుప్పించేవారు అంగీకరించాలని అన్నారు.
సంజయ్ రౌత్ ప్రతిరోజూ అసత్యాలు ప్రచారం చేస్తారని, ఆయన వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు తనను ప్రశ్నించడం సరైంది కాదని చెప్పారు. వాయువ్య ముంబైలో ఈవీఎంలు హ్యాక్ అయితే, దక్షిణ మధ్య ముంబైలోనూ, ఈశాన్య ముంబైలోనూ హ్యాక్ అవుతాయని అన్నారు.
ముందుగా వారి పార్టీ నుంచి గెలుపొందిన ఇద్దరు, ముగ్గురు ఎంపీలు రాజీనామా చేయాలని అప్పుడు ఈవీఎంల గురించి మాట్లాడాలని అన్నారు. ఈవీఎంలపై అసత్యాలు చెబుతున్న సంజయ్ రౌత్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ చేశారు. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వ్యాఖ్యలు చేసిన ఆదిత్య ఠాక్రే కూడా క్షమాపణ చెప్పాలని ఆయన పేర్కొన్నారు.
Read More :
Susmitha Konidela | నాకు చరణ్‌కు పవన్ బాబాయ్ గొడవలు పెట్టేవాడు : సుస్మిత కొణిదెల
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

