Susmitha Konidela | మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణంలో వచ్చిన తాజా వెబ్ సిరీస్ ‘పరువు’ (Paruvu). గోల్డెన్ బాక్స్ ఎంటర్టైనమెంట్ బ్యానర్‌పై సుస్మిత కొణిదెల ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించగా నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య నాగబాబు కీలక పాత్రలు పోషించారు. టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ కొన్ని రోజుల క్రితం పోలీసులతో గొడవపడినట్లు వీడియోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ గొడవ అంతా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా చేసినదే. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ వేదిక జీ5లో జూన్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ వెబ్ సిరీస్‌కు పాజిటివ్ టాక్ రావడంతో తాజాగా సుస్మిత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇక ఈ ఇంటర్వ్యూలో తన బాబాయ్ ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది సుస్మిత.
ఈ ఇంటర్వ్యూలో సుస్మిత మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ బాబాయ్ డిప్యూటీ సీఏం అయినందుకు చాలా ఆనందంగా ఉంది. పవన్ బాబాయ్ మాతో ఎప్పుడు సరదాగా ఉండేవారు. నా చిన్నప్పుడు నాకు చరణ్ కు గొడవలు వచ్చేవి. అయితే ఆ గొడవలు వచ్చేది పవన్ బాబాయ్ వల్లే. ఆయన మా ఇద్దరి మధ్య గొడవ పెట్టి మేము కొట్టుకుంటుంటే సినిమాను చూసినట్లు చూస్తారు. అది సరదాగా ఉండేది. ఇప్పుడు గుర్తుతెచ్చుకుంటే నవ్వోస్తుంది. బాబాయ్ రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రజల మనిషి. వారి కోసం ఆయన ఏదైనా చేస్తాడు’ అంటూ సుస్మిత చెప్పుకోచ్చింది.