న్యూఢిల్లీ : దివ్యాంగ చిన్నారుల కోసం ఓ వ్యక్తి యువర్ కైండ్ ఆఫ్ కట్స్ పేరుతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెలూన్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. గుడ్‌న్యూస్ మూవ్మెంట్ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను (Viral Video) షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. బిల్లీ అనే వ్యక్తి ఈ వినూత్న సెలూన్‌ను ఏర్పాటు చేసి ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు సేవలందిస్తున్నారు.
ఈ వీడియోలో బిల్లీలో ఓ చిన్నారికి హెయిర్ కట్ చేసేందుకు ప్రయత్నించడం కనిపిస్తుంది. క్షవరం చేయించుకునేందుకు బాలుడు నిరాకరిస్తుండగా బిల్లీ అతడికి నచ్చచెపుతూ పని పూర్తి చేయడం ఈ క్లిప్‌లో చూడొచ్చు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు ఎంతో సహనంతో బిల్లీ హెయిర్ కట్ చేయడం పలువురిని ఆకట్టుకుంది.
ఈ పోస్ట్‌ను ఇప్పటివరకూ ఏకంగా 18 లక్షల మంది వీక్షించగా పెద్దసంఖ్యలో నెటిజన్లు రియాక్టయ్యారు. బిల్లీ తన దయాగుణంతో ఎంతోమంది ముఖాలపై నవ్వులు పూయిస్తున్నారని పలువురు యూజర్లు అతడిపై ప్రశంసలు గుప్పించారు.
Read More :