Sonia Gandhi: కాంగ్రెస్‌ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు: సోనియా గాంధీ
Sonia Gandhi: ఎలక్టోరల్ బాండ్ల వల్ల బీజేపీకి చాలా లాభం చేకూరిందని, మరో వైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీపై మాత్రం తీవ్ర దాడి జరుగుతున్నట్లు సోనియా పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు అసాధారణమైనవని, అప్రజాస్వామికమైనవన్నారు.
న్యూఢిల్లీ: ఓ వ్యవస్థీకృత పద్ధతిలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా నిర్వీర్యం చేస్తున్నారని ఆ పార్టీ నేత సోనియా గాంధీ(Sonia Gandhi) అన్నారు. ఎలక్టోరల్ బాండ్ల అంశం గురించి ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. ఎలక్టోరల్ బాండ్ల అంశం కేవలం కాంగ్రెస్ పార్టీపై మాత్రమే ప్రభావం చూపడంలేదని, ప్రాథమికంగా అది మన ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తుందని ఆమె అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ వ్యవస్థీకృత దాడి చేస్తున్నారన్నారు. ప్రజల నుంచి వసూల్ చేసిన నిధుల్ని ఫ్రీజ్ చేశారని, తమ అకౌంట్ల నుంచి డబ్బును లాగేసుకుంటున్నారని ఆరోపించారు. చాలా విపత్కర పరిస్థితులు, సవాళ్ల మధ్య తమ ఎన్నికల ప్రచారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఆమె అన్నారు. ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు పేర్కొన్నదన్నారు. ఎలక్టోరల్ బాండ్ల వల్ల బీజేపీకి చాలా లాభం చేకూరిందని, మరో వైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీపై మాత్రం తీవ్ర దాడి జరుగుతున్నట్లు సోనియా పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల విషయంలో జరుగుతున్న పరిణామాలు అసాధారణమైనవని, అప్రజాస్వామికమైనవన్నారు.
A systematic effort is underway by the Prime Minister to cripple the Indian National Congress financially. Funds collected from the public are being frozen, and money from our accounts is being taken away forcibly.
However, even under these most challenging circumstances, we… pic.twitter.com/9a72ujK3QC
— Congress (@INCIndia) March 21, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

