Padi Kaushik Reddy | కోడికున్న దిమాక్ కూడా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి లేదు.. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Padi Kaushik Reddy | తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కోడికున్న దిమాక్ కూడా లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌవులా పనులు అయినా.. వాహలా పనులు అయినా కోమటిరెడ్డితోనే సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు.
Padi Kaushik Reddy | కరీంనగర్ : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కోడికున్న దిమాక్ కూడా లేదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌవులా పనులు అయినా.. వాహలా పనులు అయినా కోమటిరెడ్డితోనే సాధ్యమవుతాయని ఆయన పేర్కొన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడారు.
నిన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హరీశ్‌రావును విమర్శించిన తీరు చాలా బాధాకరమన్నారు. కోమటిరెడ్డి మంత్రి కాగానే కండకావరం పెరిగింది. మంత్రిలాగా మాట్లాడుతలేడు.. మూర్ఖుడిలా మాట్లాడుతున్నాడు. ఆయన మానసిక పరిస్థితి బాగా లేదనిపిస్తుంది. మందు తాగి ప్రెస్ మీట్ పెట్టి హరీశ్‌రావును తిడుతున్నాడు. ఈ రాష్ట్ర మంత్రి వర్గంలోనే సబ్జెక్ట్ లేని సన్నాసి కోమటిరెడ్డి. ఆయన ఒక జోకర్, బ్రోకర్, తాగుబోతు. జూనియర్ అయిన రేవంత్ రెడ్డి కింద పని చేయడం సిగ్గు అనిపిస్తలేదా..? అని పాడి కౌశిక్ రెడ్డి నిలదీశారు.
ఆ దేవుడు కోడికున్న దిమాక్ కూడా కోమటిరెడ్డికి ఇవ్వలేదు. ఆయన మాట్లాడే తీరు, భాష బాగాలేదు. ఏం మాట్లాడుతాడో కూడా తెల్వదు. పంద్రాగస్టు లోపు రుణమాఫీ చేస్తామన్న రేవంత్ రెడ్డి.. రాజీనామా లేఖ ఎందుకు ఇవ్వడం లేదు. ఆయన మీద ఆయనకే నమ్మకం లేదా..? లుచ్చా మాటలు చెప్పాలి.. ఓట్లు దండుకోవాలనేది రేవంత్ ప్లాన్. రేవంత్ మీద నమ్మకం లేకనే హరీశ్ సవాల్ విసిరిండు. రేవంత్‌ను నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఆరు గ్యారెంటీలు అమలు చేశానని అసెంబ్లీలో, పలు బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇది అబద్దం. కర్ర కాల్చి వాత పెడితేనే కాంగ్రెస్ హామీలన్నీ అమలు అవుతాయన్నారు కౌశిక్ రెడ్డి.
కోమటిరెడ్డికి సవాల్ విసరుతున్నా.. మీరు ఏ ఫార్మాట్లో అడిగితే ఆ ఫార్మాట్లో హరీశ్‌రావుతో రాజీనామా చేయిస్తా.. ఆ బాధ్యత నాది. మరి నువ్వు రేవంత్ రెడ్డిని కూడా అదే ఫార్మాట్లో రాజీనామా చేయించే బాధ్యత తీసుకుంటావా..? ఈ సవాల్‌ను స్వీకరించేందుకు రెడీగా ఉన్నావా..? రాజీనామా లేఖను ఇచ్చిన తర్వాతనే ఓట్లు అడగాలి. లేకుంటే ఓట్లు అడగొద్దు. తెలంగాణ ప్రజలారా.. రేవంత్ మాటలు విని అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మోసపోవద్దు అని పాడి కౌశిక్ రెడ్డి సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

