Kalpana Soren | ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్..
Kalpana Soren | జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గండీ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె జేఎంఎం అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ మేరకు జేఎంఎం పార్టీ అమెను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
Kalpana Soren : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, జేఎంఎం పార్టీ అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సతీమణి కల్పనా సోరెన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. గండీ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె జేఎంఎం అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఈ మేరకు జేఎంఎం పార్టీ అమెను తమ అభ్యర్థిగా ప్రకటించింది.
జేఎంఎం ఎమ్మెల్యే సర్ఫరాజ్ అహ్మద్ ఇటీవల రాజీనామా చేయడంతో గండీ అసెంబ్లీ స్థానం ఖాళీ అయ్యింది. దాంతో ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నిక కోసం జేఎంఎం అభ్యర్థిగా కల్పనా సోరెన్ పేరు ఖరారయ్యింది. భూకుంభకోణం కేసులో ఆమె భర్త హేమంత్ సోరెన్ జైలుకు వెళ్లడంతో పార్టీకి అన్నీ తానై ఆమె వ్యవహరిస్తున్నారు.
ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా బరిలో దిగి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశిస్తున్నారు. కల్పనా సోరెన్ ఒడిశాలో పుట్టి పెరిగారు. మయూర్భంజ్ జిల్లాలో ఆమె పాఠశాల విద్యను అభ్యసించారు. ఆ తర్వాత భువనేశ్వర్‌లో ఇంజినీరింగ్, ఎంబీఏ పూర్తిచేశారు. కాగా గండీ అసెంబ్లీ స్థానానికి ఐదో విడత లోక్‌సభ ఎన్నికలతో పాటు మే 20న పోలింగ్ జరగనుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

