న్యూఢిల్లీ: ‘ఒక దేశం – ఒకే ఎన్నికలు’పై కేంద్ర ప్రభుత్వం చురుగ్గా కదులుతున్నది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ మార్చి 15న నివేదికను సమర్పించింది. ఈ నివేదికను త్వరలో కేంద్ర క్యాబినెట్‌కు అందజేయాలని న్యాయ శాఖ ప్రయత్నిస్తున్నది.
ప్రధాని మోదీ నూతన ప్రభుత్వానికి నిర్దేశించిన తొలి 100 రోజుల ఎజెండాలో ఇది కూడా భాగమే. కోవింద్ కమిటీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించిన నివేదికలో అనేక సిఫారసులు చేసింది. ముందుగా లోక్‌సభ, రాష్ర్టాల శాసన సభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, అవి పూర్తయిన 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని తెలిపింది. మరోవైపు జమిలి ఎన్నికలపై లా కమిషన్ కూడా తన నివేదికను త్వరలోనే ఇవ్వబోతున్నట్లు తెలుస్తున్నది.