Leopard | అడవిలో ఉండాల్సిన వన్య ప్రాణులు, క్రూర జంతువులు ఇటీవలే కాలంలో జనావాసాల్లోకి ప్రవేశిస్తున్నాయి. అటవీ సమీప ప్రాంతాల్లోని గ్రామాల్లోకి వచ్చి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర నాగ్పూర్ (Nagpur)లో ఓ చిరుత (Leopard) కలకలం రేపింది. పట్టపగలే పార్ది (Pardi) ప్రాంతంలోని నివాస ప్రాంతంలోకి ప్రవేశించి ప్రజలపై దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురు గాయపడ్డారు.
చిరుతని చూసిన ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని చిరుతను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దానికి మత్తుఇంజక్షన్ ఇచ్చి బంధించారు. అనంతరం అక్కడి నుంచి చిరుతను తరలించారు. ఇందుకు సంబంధించిన దృష్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మరోవైపు చిరుత దాడిలో గాయాలపాలైనవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
#WATCH | Nagpur, Maharashtra: A leopard entered the residential area of Pardi locality, injuring 7 people. pic.twitter.com/TUGdBrr6oL
— ANI (@ANI) December 10, 2025
Also Read..
Divorce: తండ్రి కాలేడు.. పెళ్లైన 3 రోజులకే విడాకులు కోరిన వధువు
Amazon | 2030 నాటికి భారత్లో అమెజాన్ 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు.. భారీగా ఉద్యోగాలు
IndiGo | ఢిల్లీ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిన ఇండిగో సంక్షోభం.. రూ.1,000 కోట్ల నష్టం