IndiGo | ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. వరుసగా పదోరోజూ వందలాది విమానాలు రద్దయ్యాయి. ఇక ఈ సంక్షోభం ఢిల్లీ ఆర్థిక వ్యవస్థపై (Delhi economy) తీవ్ర ప్రభావం చూపింది. విమానాల రద్దు కారణంగా ఢిల్లీలో వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు భారీగా నష్టం వాటిల్లింది. దాదాపు రూ.1,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (Chamber of Trade and Industry) వెల్లడించింది.
విమాన రాకపోకల్లో అంతరాయం వల్ల వ్యాపారులు, పర్యాటకులు, బిజినెస్ ట్రావెలర్స్ రాకపోకలకు అంతరాయం కలిగిందని పేర్కొంది. దీని కారణంగా నగరం అంతటా మార్కెట్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గినట్లు సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ తెలిపారు. గత 10 రోజుల్లో ఢిల్లీ మార్కెట్లలో జనసంచారం దాదాపు 25% తగ్గిందని పేర్కొన్నారు. సాధారణంగా ఢిల్లీ విమానాశ్రయం నుంచి ప్రతిరోజూ 1.5 లక్షలకుపైగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారని.. అందులో దాదాపు 50 వేల మంది వ్యాపారులు, బిజినెస్ ట్రావెలర్స్ ఉంటారని తెలిపారు.
అయితే, ఇండిగో విమానాల రద్దుతో వ్యాపారుల రాకపోకలు తగ్గాయని, ఫలితంగా టోకు మార్కెట్లు, రిటైల్ హబ్‌లకు నష్టాలు సంభవించినట్లు వివరించారు. గత వారం రోజుల్లోనే హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్ట్లు వేలాదిగా రద్దైనట్లు చెప్పారు. ముఖ్యంగా ఢిల్లీ ఎగ్జిబిషన్, ఈవెంట్స్ ఎకోసిస్టమ్‌పై దీని ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు తెలిపారు. గత 10 రోజులుగా ప్రగతి మైదాన్, ఆనంద్ మండపంలో ఆటోమొబైల్స్, చేనేత, వస్త్రాలు, గృహోపకరణాలు వంటి పెద్ద ప్రదర్శనలు జరుగుతున్నాయని, ఇండిగో సంక్షోభంతో వీటిపై తీవ్ర ప్రభావం పడినట్లు వెల్లడించారు.
Also Read..
Donald Trump | భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపా.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట
H-1B Visa | భారతీయులకు అమెరికా షాక్.. వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా
Pakistan Army: మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జర్నల్… వీడియో