H-1B Visa | హెచ్-1బీ వీసాతో అమెరికా వెళ్లాలనుకునేవారికి ఊహించని షాక్ తగిలింది. అమెరికా ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ పాలసీ (US Social Media Rules) గందరగోళానికి దారి తీస్తోంది. ఈ విధానం వల్ల భారత్‌లో భారీ సంఖ్యలో వీసా అపాయింట్మెంట్లు (H-1B Visa Appointments) వచ్చే ఏడాదికి వాయిదా పడ్డాయి. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా ప్రకటన చేసింది. వీసా అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసినట్లు మీకు ఈమెయిల్ వచ్చి ఉంటే, కొత్త తేదీలో మాత్రమే హాజరు కావాలని రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఒకవేళ ఎవరైనా పాత తేదీలో ఇంటర్వ్యూ కోసం వస్తే వారిని కాన్సులేట్‌లోకి అనుమతించబోమని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 85 వేల వీసాలను అమెరికా రద్దు చేసింది. దీనిపై అమెరికా విదేశాంగ శాఖ తాజాగా సోషల్‌మీడియా వేదికగా ఒక ప్రకటన చేసింది. సరిహద్దు భద్రత, వలస పర్యవేక్షణకు తాము అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఈ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, విదేశాంగ కార్యదర్శి మార్క్ రుబియో ఒకే లక్ష్యాన్ని అనుసరిస్తున్నారని విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో తెలిపింది. ఈ ప్రక్రియ ఆగదని పేర్కొంది. అంతేకాకుండా దీనికి ట్రంప్ ఫొటోతో ఉన్న ఒక పోస్టర్‌ను పోస్టు చేసింది. దానిపై మేక్ అమెరికా సేఫ్ అగైన్ అనే క్యాప్షన్ కూడా ఉండటం గమనార్హం.
Also Read..
ప్రభుత్వ పథకాల పేరిట బీజేపీ చందాల దందా!
Pakistan Army: మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జర్నల్… వీడియో
Women Violence: 2023లో వంద కోట్ల మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారు..