ఇస్లామాబాద్: పాకిస్థాన్(Pakistan Army) ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్(ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ ఓ మహిళా జర్నలిస్టుకు కన్నుసైగ చేయడం వివాదాస్పదం అయ్యింది. దీంతో ఆయనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గురించి మహిళా జర్నలిస్టు అబ్సా కోమన్ ప్రశ్న వేసిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఇమ్రాన్ ఖాన్ వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం ఉందని, దేశవ్యతిరేకి అని, ఢిల్లీ కనుసన్నలో ఉన్నట్లు ఆరోపణలు చేశారని, దీంట్లో ఎంత వాస్తవం ఉందని ఆ జర్నలిస్టు అడిగారు. గతంతో పోలిస్తే దీంట్లో ఏమైనా తేడా ఉందా, లేక భవిష్యత్తులో ఏదైనా జరగవచ్చా అని ఆ మహిళా రిపోర్టర్ ప్రశ్న వేసింది. ఆ ప్రశ్నకు లెఫ్టినెంట్ జనరల్ చౌదరీ సమాధానం ఇస్తూ.. ఇమ్రాన్ ఖాన్ ఓ మెంటల్ పేషెంట్ అని చెబుతూ మహిళా జర్నలిస్టు వైపు కన్నుకొట్టాడు. ఆ ఘటనకు చెందిన ఓ వీడియో వైరల్ అవుతున్నది. కెమెరా ముందు ఆర్మీ ఆఫీసర్ కన్నుకొట్టాడని, పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యం లేదని, పీఎం ఓ కీలుబొమ్మ అయ్యారని కొందరు కామెంట్ చేశారు. ఇమ్రాన్‌ను జైలులో కలుస్తున్నవాళ్లంతా పాకిస్థాన్ ఆర్మీపై విషం చిమ్ముతున్నారని చౌదరీ ఆరోపించారు.
Pakistan’s Army’s DG ISPR winking at a female journalist after she questioned why they are being labelled as funded by Delhi.
Honestly, I am not even surprised.pic.twitter.com/FzA4SMgSM8
— Elite Predators (@elitepredatorss) December 9, 2025