Donald Trump | భారత్-పాక్ విషయంలో (India-Pak Conflict) అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వైఖరి ఏమాత్రం మారడం లేదు. ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని తానే ఆపానంటూ మరోసారి చాటింపు వేసుకున్నారు. పెన్సిల్వేనియా (Pennsylvania) రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ ఈ సందర్భంగా భారత్-పాక్ మధ్య వివాదంపై ప్రస్తావించారు.
ఈ సందర్భంగా రెండు అణ్వాయుధ దేశాల మధ్య వివాదాన్ని తానే ముగించానంటూ వ్యాఖ్యానించారు. పెన్సిల్వేనియాలోని మౌంట్ పోకోనోలో జరిగిన ఓ ర్యాలీలో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘10 నెలల్లో నేను ఎనిమిది యుద్ధాలను ఆపా. వాటిలో కొసావో-సెర్బియా, భారత్-పాక్, ఇజ్రాయెల్-ఇరాన్, ఈజిస్ట్-ఇథియోపియా, అర్మేనియా-అజర్బైజాన్ ఉన్నాయి’ అని వ్యాఖ్యానించారు.
కాగా, ఈ ఏడాది మే నుంచి ట్రంప్ 70 సార్లకుపైనే ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. పాక్-భారత్ మధ్య యుద్ధం తానే ఆపానంటూ ప్రపంచ వేదికగా చెప్పుకుంటున్నారు. అయితే, ఈ విషయంలో భారత్ మాత్రం మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని మొదటి నుంచి ఖండిస్తూ వస్తోంది. స్వయంగా ప్రధానే ఈ విషయాన్ని చెప్పినప్పటికీ.. ట్రంప్ ప్రకటనలు మాత్రం ఆగడం లేదు. ఏదో ఒకచోట భారత్-పాక్ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రెండు దేశాల మధ్య యుద్ధం ఆపింది తానే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు.
Also Read..
H-1B Visa | భారతీయులకు అమెరికా షాక్.. వీసా అపాయింట్మెంట్లు వచ్చే ఏడాదికి వాయిదా
Pakistan Army: మహిళా జర్నలిస్టుకు కన్నుకొట్టిన పాక్ ఆర్మీ లెఫ్టినెంట్ జర్నల్… వీడియో
Women Violence: 2023లో వంద కోట్ల మంది మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారు..