బెంగళూరు కేఫ్‌లో బాంబ్ బ్లాస్ట్!
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.
- 10 మందికి తీవ్ర గాయాలు
- ఐఈడీ పరికరాల వల్లే ప్రమాదం
- హైదరాబాద్‌లో హై అలర్ట్
- రెండు కోణాల్లో దర్యాప్తు
- ఐఈడీ పరికరాల వల్లే: సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సీఎం సిద్ధరామయ్య మీడియాతో మాట్లాడుతూ ‘మధ్యాహ్నం 12.30 గంటలకు పేలుడు జరిగింది. ఎన్ఐఏ, బాంబ్ స్కాడ్, ఫోరెన్సిక్ నిపుణులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఐఈడీ పరికరాల్ని ఉపయోగించి పేలుడుకు పాల్పడ్డారు’ అని అన్నారు.
రెండు కోణాల్లో దర్యాప్తు
రామేశ్వరం కేఫ్ పేలుడు ఘటనలో దర్యాప్తు సంస్థలు రెండు కోణాలను పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. వీటిలో ఒకటి ఉగ్రవాద కోణం కాగా, మరొకటి వ్యాపార శత్రు త్వం. ఈ కేఫ్‌కు సంబంధించిన శాఖలన్నీ బాగా వ్యాపారం చేస్తుండటంతో, వాటి ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు జరగవచ్చునని ఓ వా రం నుంచి సంకేతాలు వస్తున్నట్లు చెప్తున్నారు.
హైదరాబాద్‌లో హై అలర్ట్
హైదరాబాద్ సిటీబ్యూరో (నమస్తే తెలంగాణ): బెంగళూరులో బాంబు పేలుడుతో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. బస్స్టాండ్లు, రైల్వే స్లేషన్లు, ఇతర రద్దీ ప్రాంతాలలో శుక్రవారం సాయంత్రం నుంచి వాహనాల తనిఖీలు నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. బాంబ్‌స్కాడ్, డాగ్ స్కాడ్లతో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

