బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో ఈ నెల 1న జరిగిన బాంబు పేలుడు ఘటన నిందితుడి వివరాలు అందిస్తే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. అనుమానితుడి ఫొటోను షేర్ చేసింది.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రెస్టారెంట్ రామేశ్వరం కేఫ్‌లో శుక్రవారం భారీ బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మొత్తం 10 మంది తీవ్రంగా గాయపడ్డారు.