న్యూఢిల్లీ: బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో ఈ నెల 1న జరిగిన బాంబు పేలుడు ఘటన నిందితుడి వివరాలు అందిస్తే రూ.10 లక్షల రివార్డు ఇస్తామని ఎన్ఐఏ ప్రకటించింది. అనుమానితుడి ఫొటోను షేర్ చేసింది. అందులో అతడు టోపీ, మాస్క్, కళ్లకు అద్దాలు ధరించి ఉన్నాడు. అనుమానితుడి వివరాలు తెలిపేందుకు ఫోన్ నంబర్లు, ఈ-మెయిల్స్ ఇచ్చింది.