Bomb Threat Email | విధ్వంసానికి తెగబడతాం : కర్నాటక ప్రభుత్వానికి బాంబు బెదిరింపు ఈ-మెయిల్
Bomb Threat Email : రామేశ్వరం కేఫ్‌లో ఇటీవలి పేలుడుతో బెంగళూర్ నగరం ఉలిక్కిపడగా తాజాగా ఓ వ్యక్తి నుంచి కర్నాటక ప్రభుత్వానికి సోమవారం బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది.
Bomb Threat Email : రామేశ్వరం కేఫ్‌లో ఇటీవలి పేలుడుతో బెంగళూర్ నగరం ఉలిక్కిపడగా తాజాగా ఓ వ్యక్తి నుంచి కర్నాటక ప్రభుత్వానికి సోమవారం బెదిరింపు ఈమెయిల్ రావడం కలకలం రేపింది. బెంగళూర్‌లో శనివారం పేలుడు జరుగుతుందని మెయిల్ పంపిన వ్యక్తి బెదిరించాడు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి, బెంగళూర్ పోలీస్ కమిషనర్లను ఉద్దేశించి అజ్ఞాత వ్యక్తి ఈ మెయిల్ పంపాడు.
ఈ-మెయిల్ పంపిన వ్యక్తిని షాహిద్ ఖాన్‌గా గుర్తించారు. ఈమెయిల్లో పేర్కొన్న వివరాల ప్రకారం రెస్టారెంట్లు, ఆలయాలు, బస్సులు, రైళ్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పేలుడు జరుగుతుందని స్పష్టం చేశారు.
బహిరంగ కార్యక్రమాల్లో బాంబులను కూడా అమరుస్తామని మెయిల్ పంపిన వ్యక్తి హెచ్చరించాడు. పేలుడుకు పాల్పడకుండా ఉండేందుకు తమకు రూ. 20 కోట్లుపైగా చెల్లించాలని నేరగాళ్లు డిమాండ్ చేసినట్టు మెయిల్ హెచ్చరించింది. కాగా ఈ వ్యవహారంపై సుమోటోగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Read More :
MLC Kavitha | ఇదేనా రేవంత్ రెడ్డి ప్రజా పాలన.. ఎమ్మెల్సీ కవిత ఫైర్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

