పుణె: పెరిగిన టమాట ధరల కారణంగా మహారాష్ట్రకు చెందిన ఒక రైతు కేవలం నెల రోజుల వ్యవధిలోనే కోటిన్నర రూపాయలు ఆర్జించాడు. పుణె జిల్లాకు చెందిన తుకారామ్ భాగోజి తనకున్న 30 ఎకరాల్లో టమాటానే పండించాడు.
ఈ నెల రోజుల వ్యవధిలో 13 వేల టమాట బాక్స్‌లను అమ్మడం ద్వారా రూ.1.5 కోట్లు సంపాదించాడు. ఒక్క శుక్రవారమే ఒక్కో బాక్స్ రూ.2100కు అమ్మడం ద్వారా 18 లక్షల రూపాయలు ఆర్జించాడు. ఈ నెల రోజుల వ్యవధిలో ఒక్కో బాక్స్ వెయ్యి నుంచి 2,400 ధరకు అమ్మానని రైతు తెలిపాడు. కర్ణాటక రైతు రెండు వేల బాక్స్‌ల టమాటాలను అమ్మి రూ.38 లక్షలు జేబులో వేసుకున్నాడు.