e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News Farmer Died : ఆందోళన చేస్తున్న రైతు మృతి.. గుండెపోటుతో అంటున్న పోలీసులు

Farmer Died : ఆందోళన చేస్తున్న రైతు మృతి.. గుండెపోటుతో అంటున్న పోలీసులు

న్యూఢిల్లీ : (Farmer Died) కేంద్ర వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నారు. రైతులకు పలు పార్టీలు, సంఘాలు మద్దతు తెలిపాయి. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ-సింఘు సరిహద్దులోని టెంట్‌లో ఉన్న ఓ రైతు చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ రైతులు చేస్తున్న ఆందోళనలు ఇవాల్టికి ఏడాది రోజులు పూర్తయ్యాయి.

భారత్‌ బంద్‌ను పురస్కరించుకుని రైతులు రోడ్డెక్కారు. కేంద్రంపై ఒత్తిడిని తీసుకువచ్చేందుకు జాతీయ, రాష్ట్ర రహదారులపై కూర్చున్నారు. పలు జాతీయ రహదారులపై ట్రాఫిక్‌ నిలిచిపోయింది. భారత్‌ బంద్‌ సందర్భంగా ఢిల్లీ నుంచి బయల్దేరే అనేక రైళ్లు రద్దయ్యాయి. బంద్ ప్రభావం ముఖ్యంగా హర్యానా, పంజాబ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. బంద్‌కు కాంగ్రెస్‌తోపాటు ఆర్జేడీ, ఆమ్‌ ఆద్మీపార్టీ, బీఎస్‌పీ, ఎస్‌పీ, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి.

- Advertisement -

ఇలాఉండగా, ఢిల్లీ-సింఘు సరిహద్దులో ఒక రైతు కన్నుమూశాడు. అతడు గుండెపోటుతో మరణించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మరణించిన రైతును భాగెల్ రామ్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌ మార్టం నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

సరిహద్దులో క్రియాశీలకంగా చైనా.. మాడ్యులర్‌ కంటైనర్ల ఏర్పాటు

ఉద్యమమే ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఊపిరి

ప్రపంచంలో ఇదే అతి తెల్లని పెయింట్‌..!

విషపూరిత నీరు తాగినా.. ఈ బ్యాక్టీరియా మనల్ని కాపాడుతుంది!

ఇయర్‌ బడ్స్‌ వాడుతున్నారా? తస్మాత్ జాగ్రత్త! ఎందుకంటే..

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement