Bengaluru | ముంబై, మార్చి 28( నమస్తే తెలంగాణ): బెంగళూరులో నివసిస్తున్న ఓ 36 ఏండ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ తన భార్యను హత్య చేసి పుణెకు పారిపోయి ఆత్మ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. పుణెకి పారిపోయేముందు నిందితుడు తన భార్య మృతదేహాన్ని ముక్కలు చేసి సూట్‌కేసులో కుక్కి దొడ్డకన్నహల్లి ప్రాంతంలోని తన ఫ్లాట్‌లో వదిలివేయగా పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు.
రాకేష్‌ను పుణెలో పోలీసులు అరెస్టు చేశారు. మహారాష్ట్రకు చెందిన 32 ఏళ్ల గౌరీతో రాకేష్ రాజేంద్రకు వివాహమైంది. మహారాష్ట్రకు చెందిన ఈ దంపతులు ఏడాది కాలంగా బెంగళూరులో నివసిస్తున్నారు.