Manipur | రెండు జాతుల మధ్య నెలకొన్న హింసాత్మక ఘటనలతో ఏడాదిన్నర కాలంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) నుంచి మరో ఆందోళనకర వార్త వెలుగులోకి వచ్చింది. మయన్మార్ (Myanmar) నుంచి వందల సంఖ్యలో కుకీ మిలిటెంట్లు (Kuki militants) రాష్ట్రంలోకి అక్రమంగా చొబడినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో రాష్ట్రంలో అధికారులు హై అలర్ట్ (security agencies alerted) ప్రకటించారు.
మయన్మార్ నుంచి దాదాపు 900 మంది కుకీ మిలిటెంట్లు రాష్ట్రంలోకి చొరబడినట్లు ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం అందినట్లు అధికారులు తెలిపారు. వీరంతా ప్రస్తుతం 30 మంది సభ్యులతో కూడిన గ్రూపులుగా విడిపోయి రాష్ట్రంలో తిరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 28 నాటికి వీరంతా మైతీ గ్రామాలపై (Meitei villages) దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికను ఉటంకిస్తూ జాతీయ మీడియా నివేదించింది. వీరికి డ్రోన్ ఆధారిత బాంబులు, క్షిపణులు, జంగిల్ వార్ ఫేర్ వాడకంలో శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి.. భద్రతను కట్టుదిట్టం చేశారు.
Also Read..
Saripodhaa Sanivaaram OTT | ఓటీటీలోకి నాని సరిపోదా శనివారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Mobile internet services | పోటీ పరీక్ష.. ఆ రాష్ట్రంలో రెండు రోజులపాటు ఇంటర్నెట్ సేవలు బంద్
Atishi | సా. 4.30 గంటలకు ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేయనున్న ఆతిశీ.. ఢిల్లీ యంగెస్ట్ సీఎంగా రికార్డు