Saripodhaa Sanivaaram OTT | నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన తాజా చిత్రం ‘సరిపోదా శనివారం’ (Saripodhaa Sanivaaram). గత నెల 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. సినిమా రిలీజ్ అయిన 20 రోజుల్లోనే ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరింది. దీంతో ఈ చిత్రం ఓటీటీలోకి (Saripodhaa Sanivaaram OTT) ఎప్పుడొస్తుందా అని అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం ఓటీటీ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ నెల 26న (సెప్టెంబర్) ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ చిత్రం ప్రసారం కాబోతోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ ఇండియా (Netflix India) ఎక్స్ వేదికగా ప్రకటించింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించింది.
Ippati dhaaka @NameisNani rendu kaalle choosaru… moodo kannu choodataniki meeru ready ah?#SaripodhaaSanivaaram is coming to Netflix on 26th September in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi!#SaripodhaaSanivaaramOnNetflix pic.twitter.com/b0CrfvMb94
— Netflix India South (@Netflix_INSouth) September 21, 2024
నాని 31గా వచ్చిన ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించగా.. డివివి ఎంటర్టైన్మెంట్స్పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్, భారీ కాన్వాస్‌తో ఈ సినిమా తెరకెక్కించింది. గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా.. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటించాడు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. సూర్య (Nani)కి చిన్నప్పటి నుంచి విపరీతమైన కోపం. తన కోపం కారణంగా రోజూ గొడవలే. సూర్య కోపం తగ్గించడానికి తల్లి ఓ ప్రామిస్ తీసుకుంటుంది. ‘వారంలో శనివారం మాత్రమే కోపం చూపించాలి. మిగిలిన రోజులు సైలెంట్ గా వుండాలి’ ఇదీ ఆ ప్రామిస్. దీని ప్రకారం కేవలం శనివారం రోజే తన కోపాన్ని చూపిస్తుంటాడు సూర్య. తనకి కోపం తెప్పించిన వారి పేరుని చిత్రగుప్తుడిలా ఓ డైరీలో రాసి, శనివారం యముడిలా దండిస్తాడు. కట్ చేస్తే.. దయానంద్ (SJ Surya) జాలి కనికరం లేని పోలీస్ ఇన్స్పెక్టర్. తన అన్నయ్య కూర్మానంద్ (Murali Sharma)తో తనకు ఆస్తి గొడవలు వుంటాయి. ఎలాగైనా అన్నయ్య ఆస్తిని చేజిక్కించుకోవాలని చూస్తుంటాడు. తన కోపాన్ని సోకులపాలెం అనే ఊరి వాళ్ల మీద చూపిస్తుంటాడు. కోపం వచ్చినప్పుడల్లా ఆ ఊరిలో ఎవరినో ఒకరిని పట్టుకొని తప్పుడు కేసులు బనాయించి దారుణంగా కొడుతుంటాడు. అలాంటి దయ పేరుని సూర్య తన డైరీలో రాసుకుంటాడు. తర్వాత ఏం జరిగింది? దయ పేరు సూర్య డైరీలోకి ఎందుకు వచ్చింది. దయ, సోకులపాలెం జనాలనే ఎందుకు టార్గెట్ చేశాడు? ఈ కథలో పోలీస్ కానిస్టేబుల్ చారులత (Priyanka Mohan) పాత్ర ఏమిటి? ఇవన్నీ తెరపై చూడాలి.
Also Read..
Mobile internet services | పోటీ పరీక్ష.. ఆ రాష్ట్రంలో రెండు రోజులపాటు ఇంటర్నెట్ సేవలు బంద్
Shubman Gill: శుభమన్ గిల్ హాఫ్ సెంచరీ
Heavy Rains | రాష్ట్రంలో 3 రోజుల పాటు భారీ వర్షాలు..! 21 నుంచి 24వరకు ఎల్లో అలర్ట్..!!