ప్రజారవాణా వినియోగంలో మహిళలే ఎక్కువ
భారత్‌లో ప్రజారవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించుకొంటున్నది మహిళలేనని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 84 శాతం మహిళల ప్రయాణాలు ప్రజారవాణా వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయని అంచనా వేసింది.
- ప్రపంచబ్యాంకు నివేదిక
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: భారత్‌లో ప్రజారవాణా వ్యవస్థను ఎక్కువగా వినియోగించుకొంటున్నది మహిళలేనని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. 84 శాతం మహిళల ప్రయాణాలు ప్రజారవాణా వ్యవస్థ ద్వారానే జరుగుతున్నాయని అంచనా వేసింది. అయితే ఇదే సమయంలో భద్రతా, సౌకర్యం తదితర కారణాలతో పురుషులతో పోలిస్తే ఎక్కువ మంది మహిళలు పనికి నడిచివెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారని, 45.4 శాతం మంది మహిళలు కాలినడకపై పనికి వెళ్తుండగా.. పురుషుల్లో ఇది 27.4 శాతంగా ఉన్నదని తెలిపింది. భారత్‌లో ప్రజారవాణా వ్యవస్థను మహిళల భద్రతను దృష్టిలో పెట్టుకొని రూపొందించలేదని నివేదిక ఎత్తిచూపింది. దీని కారణంగా ఉద్యోగాలకు వెళ్లే వారి సంఖ్య తక్కువగా ఉన్నదని ‘ఎనేబ్లింగ్ జెండర్ రెస్పాన్సివ్ అర్బన్ మొబిలిటీ అండ్ పబ్లిక్ స్పేసెస్ ఇన్ ఇండియా’ పేరుతో విడుదల చేసిన నివేదికలో విశ్లేషించింది.
2019-20లో భారత్‌లో మొత్తం శ్రామిక శక్తిలో మహిళల శాతం 22.8%గా ఉన్నదని నివేదిక గుర్తుచేసింది. ప్రజారవాణా వ్యవస్థను ఏ విధంగా రూపొందించాలి, మహిళా ప్రయాణికుల అవసరాలకు తగ్గట్టుగా ఎలాంటి సమగ్ర చర్యలు చేపట్టాలనే దానిపై ఈ నివేదిక భారత్‌లోని నగరాలకు మార్గనిర్దేశం చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. భద్రత లేకుంటే మహిళలు బయటకు వెళ్లడం తగ్గుతుందని, ఫలితంగా ప్రజారవాణాలో వారి ప్రాతినిధ్యం తగ్గుతుందని నివేదిక పేర్కొన్నది. బహిరంగ ప్రదేశాల్లో స్ట్రీట్ లైట్లను పెంచడం, వాకింగ్-సైక్లింగ్ ట్రాక్‌లను మెరుగుపరచడం వంటి చర్యల వల్ల నాన్-మోటర్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను అధికంగా ఉపయోగించే మహిళలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

