హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): అవయవదానాల్లో తెలంగాణ మరోసారి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో నిరుడు ‘జీవన్‌దాన్’ ద్వారా 205 మంది నుంచి 763 అవయవాలను సేకరించారు. వాటిలో 604 మేజర్ ఆర్గాన్స్, 159 మైనర్ ఆర్గాన్స్, టిష్యూస్ ఉన్నట్టు ‘జీవన్‌దాన్-2025’ గణాంకాలు వెల్లడించాయి. ఈ గణాంకాల ప్రకారం.. 2013లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 41 మం ది అవయవ దానాలు చేశారు. 2025లో అవయవ దాతల సంఖ్య ఏకం గా 205కు పెరిగింది. వీరిలో 160 మంది పురుషులు, 45 మంది మహిళలు ఉన్నారు. నిరుడు మొత్తం అవయవదానాల్లో 197 (96.10%) ప్రైవేట్ దవాఖానల్లో, మిగిలిన 8 ప్రభుత్వ దవాఖానల్లో జరిగాయి. అవయవ మార్పిడిల్లో కిడ్నీలు (291), కాలేయం (186), ఊపిరితిత్తులు (95), కార్నియాలు(154) ఎక్కువగా ఉన్నాయి. వీటితోపాటు 32 గుండె, 2 చిన్నప్రేగు, 3 స్కిన్ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగాయి.
భారీగా పెరుగుతున్న రోగుల సంఖ్య
రాష్ట్రంలో అవయవ దాతల సంఖ్య ఏటికేడు పెరుగుతున్నప్పటికీ అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగుల సంఖ్య సైతం భారీగా పెరుగుతున్నట్టు ‘నేషనల్ రిజిస్ట్రీ పోర్టల్’ ఇటీవల వెల్లడించింది. దీంతో అవయవాలు అందక చాలామంది రోగులు మృత్యువాత పడుతున్నారు. అలా 2020-24 మధ్య కాలంలో ఏకంగా 113 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్యలో తెలంగాణ ఏడో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో అవయవ దానంపై ప్రతి ఒక్కరికీ విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తెలంగాణలో నిరుడు అవయవ మార్పిడి చికిత్సలు
రాష్ట్రంలో అవయవ దాతలు
అవయవ దాతల్లో