కృష్ణకాలనీ, జనవరి 10: సంక్రాంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతీవెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ముగ్గులపోటీలు నిర్వహించారు. 170 మంది మహిళలు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. గండ్ర వెంకటరమణారెడ్డి, గండ్ర జ్యోతి ముఖ్య అతిథులుగా హాజరై ముగ్గుల పోటీలు ప్రారంభించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బొమ్మతో వేసిన ముగ్గు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విజేతలు వీరే..
మొదటి బహుమతి రామప్పకాలనీకి చెందిన బీ సుమలత రూ.5,016, ద్వితీయ బహుమతి హనుమాన్‌నగర్‌కు చెందిన టీ సిరివల్లి రూ.3,016 గెలుపొందారు.