హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)లో 13 విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఈనెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతుందని పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ కు కేటాయించిన తేదీల్లో హైదరా బాద్ గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు. అభ్యర్థులు తమ ఇంటిమేషన్ లెటర్లను 12వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 19వ తేదీ అర్ధరాత్రి వరకు బోర్డు అధికారిక వెబ్సైట్ www.tgprb.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చిన చైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. సమస్యలుంటే support@tslprb.inకు ఈ-మెయిల్, 9391005006 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత దరఖాస్తులో ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదని స్పష్టంచేశారు.