హైదరాబాద్, జనవరి 10 (నమస్తే తెలంగాణ): మోతాదుకు మించి రసాయనాలు కలిగిన అల్మాంట్-కిడ్ సిరప్‌ను వాడవద్దని ఔషధ నియంత్రణ మండలి సూచించింది. ఇందులో పరిమితికి మించి ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్టు గుర్తించామని శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. మార్కెట్లో ఈ టానిక్ విక్రయాలను నిలిపివేయాలని తెలంగాణ డీసీఏ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం ఆదేశించారు. మెడికల్ షాపు నిర్వాహకులు ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం 1800-599-6969కు ఫోన్ చేయాలని సూచించారు.