మంగళూరు, జూలై 7: కేరళ, కర్ణాటక తీర ప్రాంత జిల్లాల ప్రజలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. కేరళలో భారీ వర్షాల కారణంగా ఏనిమిది మంది మృతి చెందారు. 7800 మంది నిరాశ్రయులయ్యారు. శుక్రవారం దక్షిణ కన్నడ జిల్లా బంట్వాళా తాలుకా సజిపమున్నూర్ గ్రామంలో కొండ చరియలు విరిగి పడటంతో 47 ఏండ్ల మహిళ మృతి చెందారు.
ఈ ఘటనలో గాయపడిన మృతురాలి కూతురిని(20) దవాఖానకు తరలించారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని పితోర్‌ఘర్ జిల్లాలోని దార్మాలో ధౌలీ నదిపై నిర్మించిన పాదచార వంతెన శుక్రవారం వరదల ధాటికి కొట్టకుపోవడంతో పర్యాటకులు సహా 200 మంది వరదలో చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.