మహారాష్ట్రలోని నాసిక్ వద్ద బస్సులో అగ్నిప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వస్తున్న బస్సులో మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 8 మంది దుర్మరణం పాలయ్యారని, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.