Contaminated Water | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని ఇండోర్ (Indore)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కలుషిత నీటి (Contaminated Water)ని తాగి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 100 మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. భగీరత్‌పుర కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 25 నుంచి 30 మధ్య ఈ మరణాలు నమోదయ్యాయి. డిసెంబర్ 25న మున్సిపల్ అధికారులు సరఫరా చేసిన కొళాయి నీటిలో ఓ విధమైన వాసన రావడాన్ని స్థానికులు గుర్తించారు. ఆ నీటిని తాగి (Drinking Water) పలువురు అస్వస్థతకు గురవడంతో అధికారులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఆ కాలనీకి చేరుకొని నీటిని పరిశీలించారు.
నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. అస్వస్థతకు గురైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడ పరిస్థితి విషమించి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 100 మందికిపైగా ప్రజలు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తాగునీటి పైపులైన్లలో మురుగునీరు కలవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మేయర్ తెలిపారు. ఘటనకు కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Also Read..
New Year 2026 | న్యూఇయర్‌ను 16 సార్లు సెలబ్రేట్ చేసుకోనున్న వ్యోమగాములు.. ఎలా అంటే?
New year 2026 | న్యూ ఇయర్ వేడుకలు ఏ దేశంలో ముందు జరుగుతాయో తెలుసా..?
India | మూడో పక్షం జోక్యం లేదు.. ఇండోపాక్ ఉద్రిక్తతలపై చైనా ప్రకటనను తిరస్కరించిన భారత్