New year 2026 | ప్రతి ఏడాది నూతన సంవత్సర వేడుకలు (New Year 2026) ఏ దేశంలో ముందు జరుగుతాయని అంటే ఎవరైనా టక్కున న్యూజిలాండ్ (New Zeland) అని చెబుతారు. కానీ అధికారికంగా మాత్రం ముందుగా నూతన సంవత్సరానికి స్వాగతం పలికే దేశం న్యూజిలాండ్ కాదు. పసిఫిక్ సముద్రంలోని ద్వీప దేశమైన కిరిబాటి (Kiribati) ముందుగా కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతుంది. భారత కాలమానం ప్రకారం న్యూజిలాండ్‌లో సాయంత్రం 4.30 గంటలకు అర్ధరాత్రి 12 అయితే, కిరిబాటిలో మధ్యాహ్నం 3.30 గంటలకే కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఇక ప్రపంచంలోనే చిట్టచివరిగా న్యూఇయర్‌ను సెలబ్రేట్ చేసుకునేది అమెరికానే.
కిరిబాటి చిన్న దేశం కాబట్టి దాని గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. అందుకే తొలుత అక్కడే నూతన సంవత్సర వేడుకలు జరిగినా పెద్దగా పబ్లిసిటీ ఉండదు. ఇక పెద్ద దేశాల్లో ముందుగా న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేది న్యూజిలాండే. ప్రపంచంలో మొట్టమొదట వేడుకలు చేసుకునే దేశమని అంతా భావిస్తారు. కిరిబాటి మొత్తం 33 దీవుల సముదాయం. ఈక్వెటోరియల్ పసిఫిక్ మహా సముద్రంలో ఉత్తర-దక్షిణంగా 4 వేల కిలోమీటర్లు, తూర్పు-పడమరల్లో 2 వేల కిలోమీటర్ల పరిధిలో ఈ దీవులు విస్తరించి ఉన్నాయి.
ఇండియా కంటే ముందుగా న్యూఇయర్ సెలబ్రేట్ చేసుకునే దేశాలివే..
సాయంత్రం 6.30 గంటలకు.. ఆస్ట్రేలియాలో
రాత్రి 8.30 గంటలకు.. జపాన్, ఉత్తర, దక్షిణ కొరియాలో
రాత్రి 9.30 గంటలకు.. చైనా, మలేసియా, సింగపూర్, హాంకాంగ్, ఫిలిప్పీన్స్‌లో
రాత్రి 10.30 గంటలకు.. థాయిలాండ్, వియత్నాం, కాంబోడియా
Also Read..
India | మూడో పక్షం జోక్యం లేదు.. ఇండోపాక్ ఉద్రిక్తతలపై చైనా ప్రకటనను తిరస్కరించిన భారత్
Dense Fog | ఢిల్లీలో రెడ్ అలర్ట్.. పొగమంచుతో 140కిపైగా విమానాలు రద్దు