New Year 2026 | న్యూఇయర్‌ను 16 సార్లు సెలబ్రేట్ చేసుకోనున్న వ్యోమగాములు.. ఎలా అంటే?
New Year 2026 | ఈ ఏడాది ముగింపు దశకు చేరింది. మరికొన్ని గంటల్లో 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
New Year 2026 | ఈ ఏడాది ముగింపు దశకు చేరింది. మరికొన్ని గంటల్లో 2025 ఏడాది కాలగర్భంలో కలిసిపోనుంది. కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 2026 ఏడాదికి (New Year 2026) స్వాగతం పలికేందుకు ప్రజలు రెడీ అయ్యారు. సాధారణంగా భూమ్మీద ఉన్న ప్రజలు కొత్త ఏడాదికి ఎన్నిసార్లు స్వాగతం పలుకుతారు..? ఒక్కసారే కద. అయితే, అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)లో ఉన్న వ్యోమగాములు (astronauts) మాత్రం 16 సార్లు ఈ అనుభూతిని సొంతం చేసుకుంటారట. అందుకు కారణం.. ఐఎస్ఎస్ గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతుండటమే.
ఇంటర్నెషనల్ స్పేస్ స్టేషన్ (ISS) గంటకు 28,000 కిలో మీటర్ల వేగంతో తిరుగుతుంది. దీంతో 90 నిమిషాల్లో భూమి చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేస్తుంది. ఈ నేపథ్యంలో ఐఎస్ఎస్లోని వ్యోమగాములు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి భూమిపై పగలు, 45 నిమిషాల తర్వాత రాత్రిని చూస్తారు. మరోవైపు ఐఎస్ఎస్ ఒక రోజులో భూమి చుట్టూ 16 సార్లు పరిభ్రమిస్తుంది. దీంతో అందులోని వ్యోమగాములు ప్రతి రోజు 16 సార్లు సూర్యోదయాన్ని, 16 సార్లు సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తారు. అలా ఐఎస్ఎస్లోని వ్యోమగాములు కొత్త ఏడాదిని 16 సార్లు స్వాగతం పలుకురు. తద్వారా న్యూఇయర్‌ను 16 సార్లు సెలబ్రేట్ చేసుకునే అరుదైన అవకాశం వారికి లభిస్తుందన్నమాట.
Also Read..
India | మూడో పక్షం జోక్యం లేదు.. ఇండోపాక్ ఉద్రిక్తతలపై చైనా ప్రకటనను తిరస్కరించిన భారత్
Dense Fog | ఢిల్లీలో రెడ్ అలర్ట్.. పొగమంచుతో 140కిపైగా విమానాలు రద్దు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

