న్యూఢిల్లీ: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్నది. ఒక్కరోజులోనే 127 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 781కి చేరింది. ఇందులో అత్యధికంగా ఢిల్లీలో 238 కేసులు ఉండగా, మహారాష్ట్రలో 167, గుజరాత్లో 73, కేరళ 65, తెలంగాణ 62, రాజస్థాన్ 46, కర్ణాటక, తమిళనాడులో 34 చొప్పున ఉన్నాయి. కాగా, 241 మంది ఒమిక్రాన్ బాధితులు డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఒమిక్రాన్ విజృంభణతో దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. మంగళవారం 6 వేలకు పైగా నమోదవగా, తాజాగా 44 శాతం అధికంగా రికార్డయ్యాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 9195 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,48,08,886కు చేరాయి. ఇందులో 3,42,51,292 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 4,80,592 మంది మృతిచెందారు. మరో 77,002 కేసులు యాక్టివ్గా ఉన్నాయి.