ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో (Mumbai) ఘోర ప్రమాదం చోటుచేసుకున్నది. ముంబైలోని బెంబూర్ ప్రాంతంలోని ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనమయ్యారు. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. బాధితులను సమీపంలోని దవాఖానకు తరలించేలోపే మృతిచెందారని అధికారులు తెలిపారు.
ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని చెప్పారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న షాప్‌లో మంటలు చెలరేగాయని తెలిపారు. క్రమంగా అవి మొదటి అంతస్తుకు వ్యాపించాయన్నారు. ఆ సమయంలో బాధితులంతా గాఢ నిద్రలో ఉండటంతో మరణించారని చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.