Road Accident | మహారాష్ట్ర (Maharashtra)లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. పూణె (Pune)లోని చకన్ (Chakan) ప్రాంతంలో పికప్ వ్యాను అదుపుతప్పి లోయలోకి పడిపోయింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.
పింప్రి చించ్వాడ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపల్వాడి గ్రామానికి చెందిన పలువురు మహిళలు, చిన్నారులు శ్రావణమాసం సోమవారం సందర్భంగా కుందేశ్వర్ ఆలయానికి బయల్దేరారు. అయితే, డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన 30 అడుగుల లోతులోకి పడిపోయింది. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పింప్రి చించ్వాడ్ పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు.
Also Read..
Viral Video | తనకు ఎదురుపడ్డ సింహాన్నే భయపెట్టిన వ్యక్తి.. షాకింగ్ వీడియో
Akhilesh Yadav | ఢిల్లీలో ఉద్రిక్తత.. బారికేడ్లు ఎక్కి దూకిన ఎంపీ అఖిలేష్ యాదవ్.. వీడియో వైరల్