Viral Video | సింహం (Lion) .. అడవికే రారాజు. అలాంటి సింహం మనకు ఎదురుపడితే..? ఇంకేమైనా ఉందా.. గుండె ఆగిపోదూ. అలాంటిది ఓ వ్యక్తి ఆ అడవి మృగాన్నే భయపెట్టాడు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది (Viral Video).
గుజరాత్ (Gujarat)లోని జనాగఢ్ (Junagadh) జిల్లా దుంగార్పూర్లోని పాతాపూర్ గ్రామంలో గల ఆధార్ సిమెంట్ ఫ్యాక్టరీ (Aadhar Cement Factory) వద్ద ఓ సింహం, మనిషి ఒక్కసారిగా ఎదురుపడ్డారు. సింహాన్ని చూసిన ఆ వ్యక్తి ఒక్కసారిగా వెనక్కి పరుగులు తీశాడు. సింహం కూడా వచ్చిన దారినే వెనక్కి పరుగు తీసింది. ఇందుకు సంబంధించిన షాకింగ్ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. ఆ వీడియో ప్రకారం.. రాత్రి 10 గంటల సమయంలో ఫ్యాక్టరీ బయటకు వచ్చిన వ్యక్తి గేటు వైపు నడుస్తూ కనిపించాడు. సింహం గేటుకు సమీపంలోకి వచ్చింది. మనిషి, సింహం హఠాత్తుగా ఎదురుపడ్డారు. అనంతరం ఒక్కసారిగా ఎవరిదారిన వాళ్లు వెనక్కి పరులు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఈ ఘటనపై ఫ్యాక్టరీ యజమాని సాగర్ కోటేచా స్పందించారు. చాలా రోజులుగా ఈ ప్రాంతంలో సింహాలు కనిపిస్తున్నట్లు చెప్పారు. ‘ఇది అటవీ ప్రాంతం కాబట్టి అడవి మృగాలు తిరుగుతుంటాయి. రాత్రి పూట, తెల్లవారుజామున సింహాలు కనిపించడం సర్వసాధారణం. సింహం ఎదురుపడగానే ఆ వ్యక్తి భయంతో వెనక్కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. సింహం కూడా వెనుదిరిగింది’ అని తెలిపారు. మరోవైపు వైరల్ అవుతున్న వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ వ్యక్తి సింహాన్నే భయపెట్టాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Man and lion sudden faceoff what would your reaction be? pic.twitter.com/Nfiu2bp8ut
— Nikhil saini (@iNikhilsaini) August 9, 2025
Also Read..
Air India Flight | తెరుచుకోని ఎయిరిండియా ఫ్లైట్ డోర్లు.. గంటపాటు విమానంలో చిక్కుకున్న ప్రయాణికులు
Rahul Gandhi: రాహుల్, ప్రియాంకా గాంధీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Akhilesh Yadav | ఢిల్లీలో ఉద్రిక్తత.. బారికేడ్లు ఎక్కి దూకిన ఎంపీ అఖిలేష్ యాదవ్.. వీడియో వైరల్