Uninterrupted Sleep | 59 శాతం మంది భారతీయులు రోజుకు కనీసం ఆరు గంటలు కూడా నిద్రపోవట్లేదని లోకల్ సర్కిల్స్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. ‘ఇండియా ఎలా నిద్రపోతున్నది-2025’ పేరిట నిర్వహించిన తాజా సర్వేలో నిద్ర లేమికి గల కారణాలను విశ్లేషించి, పరిష్కారాలనూ సూచించింది. తగినంత సేపు నిద్ర పోకపోతే గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, జీవక్రియ అసమతుల్యతలు, అభ్యసన సామర్థ్యాల క్షీణత తదితర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది.