Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలోని ఓ ఆలయ వేడుకల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. ఉత్సవాల్లో భాగంగా అగ్నిగుండంలో పడి ఓ భక్తుడు (devotee) ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన రామనాథపురం (Ramanathapuram) జిల్లాలో ఏప్రిల్ 10న చోటు చేసుకోగా.. ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కుసవంకుడి గ్రామంలో సుబ్బయ్య ఆలయ ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా అగ్నిగుండంలో నడవడం (Theemidhi Thiruvizha) అక్కడి ఆచారం. ఇలా చేస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో భక్తులు చెప్పులు లేకుండా అగ్నిగుండంలో నడుస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని వలంతరవాయ్ గ్రామానికి చెందిన కేశవన్ (56) కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అగ్నిగుండంపైకి పరిగెత్తుతూ అకస్మాత్తుగా నిప్పులపై పడిపోయాడు. దీంతో అప్రమత్తమైన రెస్క్యూ బృందం వెంటనే అతన్ని అగ్నిగుండం నుంచి బయటకు తీసుకొచ్చారు. కేశవన్‌కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం రామనాథపురం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మరణించాడు.
Also Read..
Rehab Centre | దారుణం.. రిహాబిలిటేషన్ సెంటర్లో రోగిపై సిబ్బంది కర్రతో దాడి.. VIDEO
Air hostess | షాకింగ్ ఘటన.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మహిళకు లైంగిక వేధింపులు
Bomb Threat | ద్వారకా కోర్టుకు బాంబు బెదిరింపులు.. అప్రమత్తమైన పోలీసులు