Air hostess | మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నెలల పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎక్కడో ఒకచోట నిత్యం లైంగిక వేధింపులు ఎదుర్కొంటూనే ఉన్నారు. తాజాగా హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ (Gurugram)లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఓ మహిళను ఆసుపత్రి సిబ్బంది (hospital staff) లైంగికంగా వేధించారు. ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఈ విషయాన్ని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 46 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ (Air hostess) ఎయిర్‌లైన్ శిక్షణ కోసం గురుగ్రామ్‌కు వచ్చింది. ఆమె తాను బస చేస్తున్న హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో నీటిలో మునిగిపోవడంతో అనారోగ్యం పాలైంది. దీంతో ఆమెను వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్ 6న ఆమె ఆరోగ్యం క్షీణించడంతో సదర్ ప్రాంతంలోని మరో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు వెంటిలేటర్ (ventilator)పై చికిత్స అందించారు. ఆ సమయంలో ఆసుపత్రి స్టాఫ్ ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఏప్రిల్ 13న ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్లారు.
ఇంటికి చేరుకున్న బాధితురాలు ఆసుపత్రిలో జరిగిన ఘటనను తన భర్తకు చెప్పింది. ఆ తర్వాత ఈ ఘటనపై సదర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తాను అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఆసుపత్రి సిబ్బంది తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు చెప్పింది. ఆ సమయంలో తన పరిస్థితి విషమంగా ఉండటంతో కదలలేకపోయానని, అరవలేకపోయానని, ప్రతిఘటించలేకపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు. ‘ఈ విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాము. స్టేట్మెంట్లను కూడా నమోదు చేశాం. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తున్నాము. అక్కడ సీసీటీవీ ఫుటేజ్‌లను కూడా సమీక్షిస్తున్నాము. దర్యాప్తు అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము’ అని పోలీసులు తెలిపారు.
Also Read..
Haryana: లవర్ సాయంతో భర్తను చంపిన యూట్యూబర్.. మృతదేహాన్ని డ్రెయినేజీలో పడేశారు
China Visas: భారతీయులకు 85 వేల వీసాలు జారీ చేసిన చైనా
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మృతి