Chhattisgarh | ఛత్తీస్గడ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. కొండగావ్-నారాయణపూర్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో రెండు మృతదేహాలు, భారీగా ఆయుధాలను భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మృతులను మావోయిస్టు అగ్రనేతలుగా గుర్తించారు. అయితే వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.