Bomb Threat | దేశంలో బాంబు బెదిరింపులు (Bomb Threat) కొనసాగుతున్నాయి. తాజాగా ఢిల్లీ (Delhi)లోని ద్వారకా కోర్టు (Dwarka court)కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. మంగళవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు గుర్తించారు. ఇవాళ ఉదయం కోర్టు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.
బెదిరింపుల గురించి బుధవారం ఉదయం 10:45 గంటల సమయంలో పీసీఆర్‌కు కాల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కోర్టు ఆవరణకు చేరుకున్నారు. అక్కడ ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువలూ కనిపించలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
Also Read..
Sabarimala Pilgrims | అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు బోల్తా.. ఒకరు మృతి
Rehab Centre | దారుణం.. రిహాబిలిటేషన్ సెంటర్లో రోగిపై సిబ్బంది కర్రతో దాడి.. VIDEO
Air hostess | షాకింగ్ ఘటన.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మహిళకు లైంగిక వేధింపులు