Rehab Centre | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengaluru)లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రైవేటు రిహాబిలిటేషన్ సెంటర్ (Rehabilitation Centre)లో చికిత్స పొందుతున్న రోగి పట్ల ఇద్దరు వ్యక్తులు కర్కశంగా వ్యవహరించారు. రోగిని కర్రలతో దారుణంగా కొట్టి గాయపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
వీడియోలో.. ఓ రోగిని గదిలో బంధించి కర్రతో విచక్షణా రహితంగా కొట్టారు. అనంతరం అక్కడి నుంచి ఈడ్చుకెళ్లారు. అతడు ఎంత వేడుకున్నప్పటికీ ఆపకుండా వారు కర్కశంగా వ్యవహరిస్తూ విచక్షణారహితంగా దాడి చేశారు. బెంగళూరుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ప్రైవేట్ రిహాబిలిటేషన్ సెంటర్ ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వైరల్ అయిన వీడియోపై పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి.. ఆ వ్యక్తిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేశారు.
Bengaluru rehab patient beaten for refusing to clean warden’s toilet#bengaluru pic.twitter.com/Z5naeKWW48
— The Tatva (@thetatvaindia) April 16, 2025
Also Read..
Air hostess | షాకింగ్ ఘటన.. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న మహిళకు లైంగిక వేధింపులు
Haryana: లవర్ సాయంతో భర్తను చంపిన యూట్యూబర్.. మృతదేహాన్ని డ్రెయినేజీలో పడేశారు
Chhattisgarh | ఛత్తీస్‌గఢ్ అడవుల్లో మరోసారి ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టు అగ్రనేతలు మృతి