Madhya Pradesh | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగు చూసింది. కొందరు వ్యక్తులు ఆవులను (Cows) నదిలోకి తోసేశారు. ఈ ఘటనలో సుమారు 20 ఆవులు మరణించాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులపై కేసు నమోదైంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సాత్నా జిల్లాలో మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బామ్‌హోర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద కొందరు వ్యక్తులు సుమారు 50కి పైగా ఆవులను ఉద్ధృతంగా ప్రవహిస్తున్న సాత్నా నది (Satna River)లోకి తోసేశారు. ఈ ఘటనలో 15 నుంచి 20 ఆవులు చనిపోయాయి. ఆవులు వరద నీటిలో కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నాగోడ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
‘బామ్‌హోర్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి కింద కొందరు వ్యక్తులు ఆవులను సాత్నా నదిలోకి తోసేసిన వీడియో మంగళవారం సాయంత్రం బయటపడింది. వీడియోను గుర్తించిన వెంటనే పోలీసు బృందాన్ని సంఘటనా స్థలానికి పంపాం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని నాగోడ్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ అశోక్ పాండే తెలిపారు. తమకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. అక్కడ సుమారు 50 ఆవుల్ని తోసేసినట్లు ఆయన చెప్పారు. వాటిలో 15 నుంచి 20 ఆవులు మరణించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం నదిలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనలో బేటా బాగ్రీ, రవి బాగ్రీ, రాంపాల్ చౌదరి, రాజ్‌లు చౌదరి అనే నలుగురు వ్యక్తులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
#BreakingNews
एमपी के सतना में दर्जनों गायों के साथ क्रूरता, ग्रामीणों ने घेरकर तेज़ धारा में बहाया। इनके ख़िलाफ़ केस दर्ज कर गिरफ़्तारी कब होगी ???@MPPoliceDeptt @CMMadhyaPradesh @Lakhan_BJP @PetaIndia @Dept_of_AHD #MPNews #Satna #PetaIndia #Cow pic.twitter.com/eAnFzlmRzX— AJEET JHA (@ajeetkumarjhaa) August 27, 2024
Also Read..
Kangana Ranaut | బాలీవుడ్ ఓ నిస్సహాయ ప్రదేశం.. ఇక్కడ టాలెంట్‌ను చూసి అసూయ పడతారు : కంగన రనౌత్
Bengal Bandh | బెంగాల్ బంద్ హింసాత్మకం : పలుచోట్ల కాల్పులు, బాంబు పేలుళ్ల ఘటనలు