Bengal Bandh : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో ట్రైనీ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా పశ్చిమ బెంగాల్ ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఈ ఘటనకు వ్యతిరేకంగా కొద్దిరోజులుగా నిరసన ప్రదర్శనలు చేపడుతున్న బీజేపీ బుధవారం 12 గంటల పాటు బెంగాల్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. బీజేపీ బంద్ పిలుపుపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఆర్జీ కర్ బాధిత డాక్టర్‌కు ఈ రోజును అంకితం చేయాలని తాము నిర్ణయించామని, తాము న్యాయం కోరుతుంటే బీజేపీ మాత్రం ఇవాళ బంద్‌కు పిలుపు ఇచ్చిందని మమతా బెనర్జీ అన్నారు.
వారికి బాధితురాలికి న్యాయం జరగాలని లేదని, వారు బెంగాల్ ప్రతిష్టను మసకబార్చేందుకే ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు. కాగా, బీజేపీ బుధవారం 12 గంటల పాటు బెంగాల్ బంద్‌కు పిలుపు ఇచ్చింది. అయితే బంద్ హింసాత్మకంగా మారింది. బెంగాల్లో పలు చోట్ల బాంబు పేలుళ్లు, కాల్పుల ఘటనలు జరిగాయి.
బీజేపీ నేత ప్రియాంగు పాండే కారుపై దుండగులు ఉత్తర 24 పరగణాల జిల్లాలో కాల్పులు జరపడం కలకలం రేపింది. ఈ ఘటనను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన నుంచి పాండే బయటపడటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ గూండాలు, పోలీసుల కుట్రతోనే ఈ దాడికి తెగబడ్డారని పాండే ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను పాలక టీఎంసీ నేతలు తోసిపుచ్చారు.
Read More :
Air India | ఎయిరిండియా కీలక నిర్ణయం.. ప్రాంతీయ భాషల్లోనూ కస్టమర్ కేర్ సేవలు